telugu navyamedia
రాజకీయ వార్తలు

కేంద్ర బడ్జెట్ తో ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం!

Nirmala seetharaman budget

కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో గణాంకాలను, ఇతర వివరాలను చదివి వినిపించారు. ఎప్పట్లానే బడ్జెట్ అంటే కొన్ని వస్తువులపై ధరలు పెరగడం, కొన్నింటిపై తగ్గడం సహజం. ఈ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ పార్టుల ధరలు తగ్గనున్నాయి.

పెరిగే ధరలు:

పొగాకు ఉత్పత్తులు

కమర్షియల్ వాహనాల స్పేర్ పార్టులు
వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు
స్కిమ్డ్ మిల్క్
టేబుల్ వేర్
వైద్య పరికరాలు
సోయా ఫైబర్, సోయా ప్రొటీన్
కిచెన్ ఉపకరణాలు
రాగి, ఉక్కు, క్లే ఐరన్
ఫర్నిచర్
చెప్పులు

తగ్గనున్న ధరలు :

ప్లాస్టిక్ ఆధారిత ముడిసరుకు
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్
మొబైల్ ఫోన్ల స్పేర్ పార్టులు
ఎలక్ట్రిక్ వాహనాలు
ముడి పంచదార
వ్యవసాయాధారిత, జంతు సంబంధ ఉత్పత్తులు
కొన్నిరకాల మద్యం

Related posts