telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఉభయసభల నుంచి టీఆర్ ఎస్‌ ఎంపీల వాకౌట్‌..

*తెలంగాణ వ‌రిధాన్యం కొనుగోలు చేయాల‌ని చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టిన టీఆర్ ఎస్ ఎంపీలు
*కేంద్రానికి వ్య‌తిరేకంగా నినాదాలు..
*చ‌ర్చ‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో స‌భ నుంచి వాకౌట్ చేశారు.

రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణ అంశంపై ఉభ‌య‌స‌భ‌ల్లో తెరాస ఎంపీలు ఆందోళనతో హోరెత్తించారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఎంపీలు స్పీకర్ పోడియం ముందు ఆందోళ‌న చేప‌ట్టారు.

ధాన్యం కొనుగోళ్ల కోసం నిర్ధిష్ట‌మైన జాతీయ విధానాన్ని ప్ర‌క‌టించండి.. అంటూ ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఆహార ధాన్యాల సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం రూపొందించాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న నేప‌థ్యంలో స్పీక‌ర్ బిర్లా స‌భ‌ను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూాడా ఎంపీలు తమ పోరాటాన్ని కొనసాగించారు. ధాన్యం సేకరణపై చర్చించాలని తెలంగాణ ఎంపీలు ప‌ట్టుబ‌ట్టారు.

అయితే చ‌ర్చ‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో లోక్‌సభ, రాజ్యసభ నుంచి వాకౌట్ చేసి పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహాం ముందు నిరసన చేపట్టారు.

Related posts