telugu navyamedia
తెలంగాణ వార్తలు

యాదాద్రి ఈవో ఓవ‌రాక్షన్..ఉద్రిక్త‌త

యాదగిరిగుట్టలో టెన్షన్ వాతావరణం నెలకొంది. యాదాద్రి ఆలయ ఈఓ గీతారెడ్డి తీరును నిరసిస్తూ స్థానికులు, వ్యాపారులు మూడురోజులు పాటు బంద్‌కు పిలుపిచ్చారు.

ఈ క్ర‌మంలో స్థానికులు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ నిర్వ‌హిస్తున్నారు. కొండపైకి ప్రైవేటు వాహనాలను అనుమతించాలని స్థానికులు, వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ బంద్‌ని కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై ఆంక్షలు విధించడంతో వారు ఘాట్‌రోడ్డు దగ్గర శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న జర్నలిస్ట్‌లను  ఆలయ ఈవో గీత పోలీసులతో బలవంతంగా అరెస్ట్ చేయించారు.

దీంతో అరెస్టులకు నిరసనగా యాదగిరిగుట్ట పోలీసుస్టేషన్‌ ఎదుట జర్నలిస్టుల బైఠాయించారు. జర్నలిస్టులకు మద్దతుగా ధర్నాలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం సహా అన్ని పార్టీల నేతలుమద్దతిచ్చారు. జర్నలిస్ట్‌లతో పాటు ధర్నాలో కూర్చుకున్నారు.

యాదాద్రి ఆలయ పునః ప్రారంభం తర్వాత దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆలయ ఈవో గీత పెట్టిన కొత్త రూల్స్ తో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించేది లేదని ఈవో గీత తేల్చిచెప్పారు.

ఇక ఈవో గీత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆమెపై స్థానిక ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీంతో నేడు బంద్ కు పిలుపునిచ్చారు.

Related posts