telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

త్వరలోనే కరీంనగర్ ప్రముఖ పర్యాటక కేంద్రం: సీఎం కేసీఆర్

KCR cm telangana

త్వరలోనే కరీంనగర్ జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించనుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాజరాజేశ్వర జలాశయాన్ని సందర్శించారు. సిరిసిల్ల మానేరు వంతెన వద్ద గోదావరి నదికి జలహారతి సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురయ్యామన్నారు. గోదావరి నది ఈ ప్రాంతాన్ని అనుకుని ప్రవహిస్తున్నప్పటికీ అప్పట్లో ఈ ప్రాంతం కరువు కాటకాలకు లోనయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని మార్చేశామన్నారు.

కాళేశ్వరం నుంచి నీటిని ఈ డ్యామ్ లకు ఎత్తి పోయించినామన్నారు. కరీంనగర్ జిల్లాలో 140 కిలోమీటర్ల మేర గోదావరి నది సజీవంగా ఉంటుందన్నారు. 1230 చెక్ డ్యాంలకు రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులిచ్చామన్నారు. కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాంల నిర్మాణం కోసం రూ.1,258 కోట్లు కేటాయించామన్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్ లలో నీటి నిల్వలు నిండుగా ఉన్నాయి. ఎస్సారెస్పీతోని ఏ మాత్రం సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో రెండు పంటలు పండే అవకాశమేర్పడిందని అన్నారు.

Related posts