నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలు శాప్ చైర్మన్ రవినాయుడు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ లు అర్జీ లను స్వీకరించారు.
విశాఖ పట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లో నాడు వైసీపీ నేతల అండతో దాదాపు రూ. 300 కోట్ల స్కాం జరిగింది అని వి. పైడారావు అన్నారు.
ఈ స్కాంకు కారకులైన అధికారులు ఇంకా విధుల్లో కొనసాగుతున్నారని దీనిపై పూర్తిగా విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనకాపల్లికి చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వి. పైడారావుఅర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
భూ సమస్యలపై వెల్లువెత్తిన వినతులు, తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం శేషగిరి. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం m.d పాతూరు గ్రామానికి చెందిన పి. బత్తెమ్మ అర్జీ లు ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం నున్న గ్రామానికి చెందిన జె. లక్ష్మీ నారాయణ అర్జీ లు ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలానికి చెందిన తవలం వెంకట రమణ. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప గ్రామానికి చెందిన నాగళ్ల నరసింహరావు అర్జీ లు ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాసాపేటకు చెందిన షేక్ సయ్యద్ బాషా. అనంతపురం జిల్లా గార్ల దిన్నె మండలం మార్తాండు గ్రామానికి చెందిన వి. లక్ష్మీ అర్జీ ఇచ్చి చర్యలకు విజ్ఞప్తి చేశారు.
అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము అని శాప్ చైర్మన్ రవినాయుడు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ అన్నారు.

