telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గ్రానైట్‌ పరిశ్రమకు కొత్త స్లాబ్‌ సిస్టమ్‌ : వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించే ఎన్నికలకు వెళతాం

*ప్ర‌కాశం జిల్లాలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌
*చీమ‌కుర్తి మెయిన్ రోడ్‌లో వైఎస్సార్ విగ్ర‌హంతో పాటు ..
*మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కర‌ణ‌
*మహనీయులకు మరణం ఉండదు
*కొత్త విధానం వల్ల కార్మికుల‌కు కూడా మంచి జ‌రుగుతుంది.
*గ్రానైట్ ప‌రిశ్ర‌మ‌కు కొత్త సీన‌రేజ్‌
*ఏప్రిల్ 14న విజ‌య‌వాడ‌లో అంబేద్క‌ర్ విగ్ర‌హం ఆవిష్కరణ
*2023 నాటికి వెలుగొండ ట‌న్నెల్ పూర్త‌వుతుంది.
*ఎన్నిక‌ల‌కు ముందే జాతికి అంకితం చేస్తాం..

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో గ్రానైట్ పరిశ్రమలకు మంచి రోజులు రానున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

అంత‌కుముందు చీమకుర్తిలో వైఎస్సార్‌ విగ్రహంతోపాటు.. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాన్నిసీఎం వైఎస్ జ‌గ‌న్‌ ఆవిష్క‌రించారు. అనంతరం.. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..చీమకుర్తి ప్రాంతం గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరు అని అన్నారు.

 వైఎస్ హయంలో తీసుకొచ్చిన ఈ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీని వల్ల చిన్న చిన్న గ్రానైట్‌ పరిశ్రమలు కష్టాల్లోకి వెళ్లిపోయాయన్నారు.

కరోనా కారణంగా చిన్న గ్రానైట్ పరిశ్రమలు దెబ్బతిన్నాయని జగన్ అభిప్రాయపడ్డారు.అందువల్లనే గ్రానైట్ పరిశ్రమలను ఆదుకునేందుకు శ్లాబ్ విధానం తీసుకువచ్చామని తెలిపారు.

చిన్న గ్రానైట్ పరిశ్రమలకు యూనిట్ కు రెండు రూపాయల విద్యుత్తు ఛార్జీలను తగ్తిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. తాము తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు ఏడువేల యూనిట్లకు లబ్ధి చేకూరనుందని అభిప్రాయపడ్డారు.

సింగిల్ బ్లేడ్‌కు 25వేల రూపాయలు, మల్టీ బ్లేడ్‌కు 54వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. రాయలసీమలో అయితే 22వేలు, 44వేలు ఇస్తామని ప్రకటించారు. దీని వల్ల ప్రభుత్వానికి ఏడాది 135 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంద‌ని అన్నారు.

కొత్త విధానం వల్ల కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించిన తర్వాతనే తాను ఎన్నికలకు వెళతా అని జగన్ అన్నారు. అలాగే విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏప్రిల్ 14న ఆవిష్కరణ ఉంటుందని జగన్ తెలిపారు.

Related posts