telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ వడ్లు కొంటారా ? కొనరా ? ..

కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్‌ అధ్యక్షతన ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్‌ఎస్ పార్టీ చేప‌ట్టిన మహా ధర్నా ముగిసింది. కేంద్రం వరిధాన్యం కొనుగోలు చేసేవరకు తెరాస పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నాలో ప్రసంగించిన సీఎం ఆయ‌న అన్నారు. మోదీ సర్కార్ వరిధాన్యం కొనుగోలు చేసేవరకు దేశంలోని రైతుల సమస్యపై తెరాస నాయకత్వం తీసుకుంటుందని తెలిపారు.

మా ఓపికకు ఓ హద్దు ఉంటుంది…తెలంగాణ పండించే వడ్లు కొంటరా ? కొనరా ? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్‌. సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతే బాగుండని హెచ్చరించారు సీఎం కేసీఆర్‌. ఏడాదిగా ఢిల్లీ లో రైతులు ఆందోళనలు చేస్తున్నారని… ఈ సభలో కూడా బీజేపీకి సీఐడీలు ఉన్నారని ఫైర్‌ అయ్యారు. కేంద్రం భయపెడితే తాను భయపడతానా ? తాను భయపడితే.. తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు.

CM KCR Maha Dharna: If the Center is annoyed with the purchase of rice .. it is not a war, it is a war CM: KCR | Telangana cm kcr fire on

సీఎం, మంత్రులు ధర్నాలు చేయడమేంటనీ భాజపా అంటుందన్న సీఎం కేసీఆర్​.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ కూడా దీక్ష చేశారని గుర్తుచేశారు. దేశంలో సీఎం, మంత్రులు కూడా ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని… అవసరమైతే దిల్లీకి యాత్ర చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇంకా చాలా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం సమస్యను పరిష్కరిస్తే ధర్నాల అవసరం ఉండదని పేర్కొన్నారు.

వానాకాలం పంట కొంటారా.. కొనరా తేల్చిచెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.క్‌, బంగ్లాదేశ్‌ కన్నా దీన స్థితిలో ఇండియా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన.. వ్యవసాయ చట్టాలు నిరంకుశ చట్టాలని ఫైర్‌ అయ్యారు. రైతులను కేంద్రం బతకనిస్తదా ? బతకనివ్వదా ? అని నిలదీశారు సీఎం కేసీఆర్‌. దిక్కుమాలిన ప్రభుత్వం కేంద్రంలో ఉందని సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు.

ఈరాష్ర్ట సాధ‌న కోసం పదవులను చిత్తు కాగితాల్లా ఎన్నిసార్లు వదిలేశామో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు అని అన్నారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజీ పోరాటం చేస్తామ‌ని. అనేక సమస్యలను పెండింగ్‌లో పెట్టారు. కుల గణన చేయాలని తీర్మాణం చేసి పంపితే ఇప్పటి వరకు దిక్కు లేదని అన్నారు.బీజేపీకి చరమగీతం పాడితేనే ఈ దేశానికి విముక్తి’ అని సీఎం కేసీఆర్‌ కేంద్రంపై నిప్పులు చెరిగారు.

Related posts