telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈ కార్పొరేషన్ ద్వారానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ: సీఎం జగన్

ys jagan cm

ఇక నుంచి ఈ కార్పొరేషన్ ద్వారానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఈ రోజు ఏపీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ఆయన ప్రారంభించారు. ఎన్నికల హామీ మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ కు సంబంధించి వెబ్ సైట్ (ఏపీ ఆప్కాస్) ను కూడా ప్రారంభించారు.

అనంతరం జగన్ మాట్లాడుతూ మధ్యవర్తులు లేకుండా, మోసాలకు, లంచాలకు తావులేని విధంగా నిరుద్యోగులకు మేలు జరిగేందుకే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయిస్తామని అన్నారు. జిల్లాస్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇచ్చేలా నిర్ణయించామని పేర్కొన్నారు.

Related posts