telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

సాగు నీటి, పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష…

ఆంధ్రప్రదేశ్ సీఎం పోలవరం ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అయితే సకాలంలో పోలవరం పూర్తి చేయాల్సిందేనని జగన్‌ అన్నారు. సాగు నీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పోలవరానికి సంబంధించి ప్రతీ పనిలో కూడా ప్రాధాన్యత నిర్ధారించుకుని ముందుకు సాగాలని.. రెండో విడత ప్రాధాన్యత ప్రాజెక్ట్‌ల కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. రెండో విడత ప్రాధాన్యతగా ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్‌లపైనా దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిజైన్ల అనుమతులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని… అనుమతులకోసం ప్రత్యేకించి ఒక అధికారిని కేటాయించాలన్నారు. సిలెండర్ల దిగుమతిలో ఆలస్యం లేకుండా చూడాలని ఆదేశించారు సీఎం జగన్. కాగా… ఫిబ్రవరి 10 నాటికి పూర్తి కానున్నాయి స్పిల్‌ వే రోడ్‌ పనులు.  స్పిల్‌ఛానల్‌లో   పనులు వేగంగా కొనసాగుతున్నాయి.  ఏప్రిల్‌ నాటికి  రేడియల్‌ గేట్లను అమర్చే ప్రక్రియ పూర్తి కానుండగా.. మే నాటికి అప్రోచ్‌ ఛానల్‌  పనులు పూర్తి చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. చూడాలి మరి ఇది ఎప్పటికి పూర్తవుతుంది అనేది.

Related posts