టీడీపీ నేత పట్టాభిరామ్‌ను విజయవాడకోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేశారు.పట్టాభిని గురువారం మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో గురువారం పోలీసులు హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు పట్టాభికి నవంబర్ 4 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు వెల్లడించింది.
ఈ సందర్భంగా పట్టాభికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. ఇప్పటికే తన ఇంటిపై పలుమార్లు దాడిచేశారని పేర్కొన్నారు. తాను సీఎంని గానీ ప్రభుత్వంలో ఉన్న వారిని గానీ వ్యక్తిగతంగా విమర్శించ లేదని పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వంలో ఉన్న లోపాలను మాత్రమే మీడియాలో ప్రస్తావించానంటూ న్యాయమూర్తికి పట్టాభి వివరించారు.
దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. పట్టాభిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే బెయిల్‌పై ఉన్నప్పటికీ పట్టాభి బెయిల్ ఆంక్షలను పాటించడంలేదని కోర్టుకు తెలిపారు.ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పట్టాభిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు.
రాష్ట్రంలో రాక్షస పాలన.. వైసీపీ సర్కార్ పై గోరంట్ల ఫైర్