telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పల్నాడు ప్రశాంతతకు భంగం కల్గించొద్దు: హోం మంత్రి సుచరిత

ap minister sucharita on fluds

గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదాలపై ఏపీ హోం మంత్రి సుచరిత స్పందించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పల్నాడులో సమస్యాత్మక గ్రామాల్ని గుర్తించామన్నారు. పల్నాడులో ప్రశాంతతకు ఎవరూ భంగం కలిగించొద్దనిన ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఎవరు ఫిర్యాదులు ఇచ్చినా స్వీకరిస్తామని.. ప్రతి సోమవారం ఎస్పీ ఆఫీసుల్లో ఫిర్యాదులు తీసుకుంటామన్నారు.

గత ఐదేళ్లలో రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిందని ఆమె చెప్పుకొచ్చారు. ఏపీ ప్రశాంతంగా ఉండటం చంద్రబాబుకు నచ్చడంలేదన్నారు. గత ఐదేళ్లలో గురజాలలో ఎన్నో ఘోరాలు జరిగాయన్నారు. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసిన వారిని టీడీపీ హయాంలో చిత్రహింసలు పెట్టారని అన్నారు. మూడు నెలల్లో 4 లక్షలకుపైగా ఉద్యోగాలను సీఎం జగన్‌ కల్పించారని చెప్పారు. సంక్షేమం, శాంతిభద్రతలు కాపాడాలని జగన్‌ చెప్పారని ఆమె తెలిపారు.

Related posts