ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 2 లక్షల కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో సైతం కరోరా పంజా విసురుతోంది. జిల్లాలోని కావలిలో ఏకంగా ఏడుగురు వ్యాపారులు కారోనా కారణంగా మృతి చెందారు. దీంతో జనాలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు అక్కడి వ్యాపార వర్గాలు సిద్ధమయ్యాయి. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. కరోనా విస్తరిస్తున్న విస్తరిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలంతా తమ వంతుగా లాక్ డౌన్ కు సహకరించాలని విన్నవించారు.