ఏపీలో ప్రస్తుతం వరుసగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. అక్రమాలు జరిగిన ఎన్నికలనే కొనసాగిస్తున్నారని…..SEC తీరును తప్పు పడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోక పోవడాన్ని తప్పు పట్టిన చంద్రబాబు పొలిట్ బ్యూరోలో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే ఐనా తప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా మారాయని బాబు ఆరోపించారు. పరిషత్ ఎన్నికల తేదీలను మంత్రులు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. కొత్త ఎస్‌ఈసీ వచ్చీ రాగానే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన అన్నారు. ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నాయని విమర్శించారు. అయితే టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం పై వైసీపీ నాయకులు కౌంటర్లు వేస్తున్నారు.
previous post
next post
ఏపీలో వైసీపీ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టే: పవన్ కల్యాణ్