సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చిత్రలహరి’. నివేదా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. తొలిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఈ సినిమా రూ.3.08 కోట్ల షేర్ ని రాబట్టింది. దీంతో వారాంతంలో ఈ సినిమా 8 నుండి 10 కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.11.05 కోట్ల వరకు జరిగింది. వారం రోజులు ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉంటే బయ్యర్లు సేఫ్ అయ్యే అవకాశం ఉంది.
ఏరియాల వారీగా “చిత్రలహరి” మొదటిరోజు కలెక్షన్స్ :
నైజాం – రూ.86లక్షలు
సీడెడ్ – రూ.51లక్షలు
గుంటూరు – రూ.30లక్షలు
కృష్ణా – రూ.24లక్షలు
నెల్లూరు – రూ.14లక్షలు
ఈస్ట్ – రూ.38లక్షలు
వెస్ట్ – రూ.24లక్షలు
ఉత్తరాంధ్ర – రూ.41లక్షలు