telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’మూవీ మాస్టర్ పీస్..మైండ్ బ్లోయింగ్..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. . రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతోన్నారు. ఎలివేషన్ సీన్లు అయితే అభిమానులకు పండుగలా అనిపిస్తాయి. ఇక సినిమా మీద రివ్యూలు దాదాపు పాజిటివ్‌గానే వచ్చాయి.

తాజాగా తన కుటుంబం తో కలిసి ట్రిపుల్ ఆర్ సినిమా వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వేశాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనేది.. ‘మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్ ఆర్ఆర్ఆర్ చిత్రం. రాజమౌళి సినిమాటిక్ విజన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మొత్తానికి హ్యాట్సాఫ్’ అంటూ మూవీ టీంపై చిరు ప్రశంసలు కురిపించారు.

ఆర్ఆర్ఆర్ ఎలా ఉంది అంటే.. చెప్పడానికి మాటలు లేవని.. సింప్లి సూపర్బ్ అని అన్నారు. ముఖ్యంగా సినిమాలో చరణ్, తారక్ ల మధ్య బాండింగ్ ఫెంటాస్టిక్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇద్దరు డ్యాన్స్ లో ఒకరితో నొకరు పోటీపడి చేశారని వీరి డాన్స్ ఎపిక్, ఇంకా చెప్పాలంటే క్లాసిక్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. చలన చిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని.. స్టార్ హీరోలు కలిసి నటించాలని మెగాస్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts