*రేపు ముచ్చింతల్‌లో శాంతి కళ్యాణం
*సీఎం విభేదాలన్న ప్రచారాలు తప్పు…
*తొలి సేవకుడుని అని కేసీఆర్ మొదటిరోజే చెప్పారు..
*సీఎం కేసీఆర్ సహాకారంతోనే సహస్రాబ్ధి ఉత్సవాలు విజయవంతం అయ్యింది..
*మాకు ప్రతిపక్షం..స్వపక్షం ఏమీ ఉండవు..మాకు అంతా సమానమే.
*రేపు జరగనున్న శాంతి కళ్యాణానికి సీఎంకు ఆహ్వానించాం..
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై చిన్నజీయార్ స్వామి ఖండించారు..ఆయనతో తమకు ఎందుకు విభేదాలు ఉంటాయని తెలిపారు. ప్రతిపక్షాలు, స్వపక్షాలు, ప్రభుత్వాలు ఇలా తమకు ఎలాంటి భేదాలు ఉండవని తెలిపారు.
కేసీఆర్ పూర్తి సహకారంతోనే రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు విజయవంతం అయ్యిందని చినజీయర్ అన్నారు. ఈ కార్యక్రమానికి తాను మొదటి సేవకుడినని కేసీఆరే మొదటి రోజే చేప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు.
సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాకపోవడానికి అరోగ్యసమస్యలు లేదా వేరే కార్యక్రమాల వల్ల రాకపోయి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. రేపు జరగనున్న శాంతి కళ్యాణానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని చెప్పిన చినజీయర్ స్వామి..ఆయన వస్తారో రారో చూడాలని వ్యాఖ్యానించారు.
రేపు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు సమతామూర్తి కేంద్రంలోని 108 ఆలయాల్లో కల్యాణ మహోత్సవం జరగునుందని చినజీయర్ స్వామి తెలిపారు.
అలాగే..రేపు జరగనున్న శాంతి కల్యాణానికి 13 రోజులుగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న అందరితో పాటు భక్తులందరూ ఆహ్వానితులేనని తెలిపారు. ప్రతి ఒక్కరు కల్యాణాన్ని దర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.