హైదరాబాద్ లోని ఓ లాడ్జిలో దారుణం జరిగింది. ప్రియుడు తన ప్రియురాలి గొంతును కోశాడు. ఈ దారుణ సంఘటన చైతన్యపురిలోని బృందావనం లాడ్జిలో జరిగింది. ప్రియురాలి గొంతు కోసిన అనంతరం ప్రియుడు కూడా తన గొంతునుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ప్రస్తుతం ఈ ప్రేమ జంటకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. యువకుడు వెంకటేశ్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రియుడు నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్, ప్రియురాలు నగరంలోని బడంగ్ పేటకు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు.
కేంద్ర బడ్జెట్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు: యనమల