telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తుడా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన చెవిరెడ్డి

YCP MLA Chevireddy Join Hospita

తిరుపతి అర్బన్‌ డెవప్‌మెంట్‌ అథారిటీ (తుడా) చైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందని ఊహించిన చెవిరెడ్డికి జగన్‌ కేబినెట్ లో చోటు దక్కలేదు. సామాజిక వర్గాలు, ప్రాంతీయ సమతుల్యతలో ఆయన అవకాశం కోల్పోయారని చెప్పుకున్నారు.

చెవిరెడ్డి అసంతృప్తి చెందకుండా తొలుత ప్రభుత్వ విప్‌గా నియమించిన ముఖ్యమంత్రి జగన్‌, అనంతరం తుడా చైర్మన్‌గా కూడా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వు జారీ చేయడంతో చెవిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ విజయరామరాజు తదితరులు భాస్కరరెడ్డిని అభినందించారు.

Related posts