ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఈసారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.
జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ సభలు జరగనున్నాయి. హెచ్ఐసీసీ నోవాటెల్ లో జరగబోయే ఈ సభలకు చంద్రబాబు హాజరుకానున్నారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.
ముగింపు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు.
ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరుకాబోతున్నారు. సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయప్రద, జయసుధ, మురళీమోహన్ తదితరులు రానున్నారు.