సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది విదేశీయులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మక్కా నుంచి మదీనా వెళ్లే హిజ్రా రోడ్డులో విదేశీయులతో వెళ్తున్న ఓ బస్సు మరో భారీ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 35 మంది మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు.
ఓడిపోయిన చోట పవన్ మొహం చూపించలేదు: అంబటి