telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కేంద్రం ఆహ్వానం.. ఈ నెల 6న హస్తినకు చంద్రబాబు..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం నుండి పిలుపు వ‌చ్చింది.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌లో పాల్గొనేందుకు రావాల‌ని చంద్ర‌బాబు కేంద్ర‌ప్ర‌భుత్వం ఆహ్వానించింది.

ఈ మేర‌కు ఈ నెల 6వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ  అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు.

75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధినేతలను కేంద్రం ఆహ్వానిం చిన విష‌యం తెలిసిందే

 

Related posts