telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

భర్త అలా అడిగినందుకు నవ వధువు ఆత్మహత్యాయత్నం…

marriage

ఓ నవ వధువు పెళ్లి పారాణి కూడా ఆరక ముందే ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం, బొట్టు చెరువు గ్రామనికి చెందిన‌ సాక స్వామి ప్రగతి నగర్ లో నివసిస్తున్నారు. స్వామి తన పెద్ద కుమార్తె సౌజన్యకు, గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్న వేంకటేశ్వర రావుకి ఇచ్చి ఈ నెల 6వ తేదీన వివాహం జరిపించారు. వివాహం అనంతరం శోభనం కోసం 9వ తేదీన ఏర్పాట్లు చేసారు. కానీ 10వ తేదీ ఉదయం, సౌజన్య భర్త వేంకటేశ్వర రావు, తమకు శోభనం జరగలేదని, వధువు నిరాకరణకు కారణం తెలుసుకోవాలని సౌజన్య తల్లిదండ్రులకు తెలిపాడు. ఇదే విషయమై మనస్తాపానికి గురైన సౌజన్య, గదిలోకి వెళ్ళి ఫ్యానుకు ఉరివేసుకుంది. సౌజన్య తలుపు తీయకపోవటంతో తలుపు పగులగొట్టి లోనికి వెళ్ళిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సౌజన్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని, సౌజన్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts