telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

గ్రేడింగ్ రద్దు.. మార్కులే ముద్దు..

ap inter board logo

ఇంటర్ విద్యావిధానంలో ఇప్పటి వరకు ఏపీలో అమలు చేస్తున్న గ్రేడింగ్ విధానం రద్దు కానుంది. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి తుది కసరత్తు చేస్తోంది. గ్రేడింగ్ విధానం కారణంగా ఇబ్బందులు వస్తుండటంతో విద్యార్దు లకు తిరిగి గతంలో మాదిరే మార్కులు ఇచ్చే ప్రతిపానకు ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది. గ్రేడ్లు ఇచ్చిన కారణంగా ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల్లో ప్రవేశాలు, ఎంసెట్‌కు ఇబ్బందులు తలెత్తిన అంశం పైన ఇంటర్ విద్యామండలి..ప్రభుత్వం ఫోకస్ చేసాయి. అయితే, మార్కులు ఎలా ఇవ్వాలనేది దాని పైన ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు. అందు కోసం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈల విధానాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రేడింగ్ విధానం వలన తలెత్తుతున్న ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌లో గ్రేడ్ల విధానాన్ని రద్దు దిశగా నిర్ణయం తీసుకుంది. దీంతో..గతంలో మాదిరే మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గ్రేడింగ్‌ విధానం వల్ల ఇబ్బందులు వస్తున్న అంశాల పైన ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వంతో చర్చించారు. ఆ స్థానంలో మార్కులు ఇవ్వటమే ఉత్తమమని సూచించారు. దీనికి అంగీకరించిన ప్రభుత్వం..గ్రేడ్ల స్థానంలో విద్యార్థులకు మార్కులే ఇవ్వాల్సిందిగా సూచించింది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో ఇంటర్‌ విద్యా మండలి వెల్లడించనుంది. ఈ గ్రేడ్‌లతో మొదటి బ్యాచి బయటకు వచ్చింది. వీరికి మొదట గ్రేడ్లు ఇవ్వడంతో ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల్లో ప్రవేశాలు, ఎంసెట్‌కు ఇబ్బందులు తలెత్తాయి. గత ఇబ్బందుల దృష్ట్యా గ్రేడ్ల విధానం ఇక కొనసాగించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో మార్కులు ఇచ్చినప్పుడు మొత్తంగా ఒక గ్రేడ్‌ ఇచ్చేవారు. ఈసారి ప్రథమ.. ద్వితీయ.. తృతీయ శ్రేణులు ఇవ్వాలా అనే అంశం పైన చర్చ జరిగింది. ఇదే సమయంలో మొత్తం మార్కులను ఇచ్చి ఉత్తీర్ణత సాధించారని మాత్రమే ఇవ్వాలా.. అనే దానిపై ఇంటర్‌ విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఇందు కోసం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈల విధానాన్ని సైతం అధ్యయనం చేస్తున్నారు.

Related posts