ఫెడరల్ ఫ్రంట్ అని తిరిగిన కేసీఆర్ పశ్చిమ బెంగాల్ ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. బెంగాల్లో కేంద్ర చర్యను తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తప్ప అందరూ ఖండించారన్నారు. ఎలక్షన్ మిషన్-2019పై ఆయన పార్టీ నేతలు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అభివృద్ధి గురించి మాట్లాడలేకే.. జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టీడీపీలో, ప్రభుత్వంలో అన్ని కులాలు ఉన్నాయని, కానీ ప్రతిపక్ష నేత జగన్ ఒకే కులానికి వంతపాడుతున్నారని విమర్శించారు. అన్ని వర్గాల బాగు కోసమే ఫెడరేషన్లు పెట్టి ప్రోత్సహిస్తున్నమని సీఎం తెలిపారు. ఏపీలో పండుగలా జరుగుతున్న పింఛన్ల పంపిణీ, పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీని అడ్డుకునేందుకు జగన్ కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపించారు.


ఓబుళాపురం మైనింగ్ కేసులో జగన్ ను ఇరికించమన్నారు.. చంద్రబాబు పై శశికుమార్ సంచలన వ్యాఖ్యలు!