telugu navyamedia
రాజకీయ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో తీవ్ర విషాదం..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మొదటి భార్య ఇవానా ట్రంప్‌ (73) గురువారం కన్నుముశారు.

The Trumpishness of Ivana | The New Yorker

ఇవానా ట్రంప్‌ మృతి విషయాన్ని ట్రంపే స్వయంగా తన సొంత సోషల్ మీడియా ‘ట్రుత్ సోషల్’ వేదికగా వెల్లడించారు. అయితే ఆమె మృతికి గల కారణాన్ని మాత్రం ట్రంప్ చెప్పలేదు.

Who was Ivana Trump, Donald Trump's first wife? Ivanka, Donald Jr. and Eric  lovingly remember the former skier, model and entrepreneur matriarch after  her death at age 73 | South China Morning Post

న్యూయార్క్ సిటీలోని తన నివాసంలో ఇవానా మరణించింది. ఆమె అందమైన, అద్భుతమైన మహిళ. గొప్ప స్ఫూర్తిదాయక జీవితాన్ని గడిపింది. ఆమెకు తన ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్‍లే సర్వస్వం. ఆమె పట్ల మేమూ గర్వపడుతున్నాం. ఇవానా ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్రంప్ భావోద్వేగ సందేశాన్ని రాసుకొచ్చారు.

Donald Trump's First Wife Ivana Dies Aged 73 | Barron's

ఇవానా ట్రంప్‌ ఓ మోడల్. 1977లో అప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఉన్న ట్రంప్‌ను పెళ్లాడారు. ఈ దంపతులకు పెళ్లైన ఏడాదికే డొనాల్డ్ జూనియర్ పుట్టాడు. ఆ తర్వాత 1981లో ఇవాంక, 1984లో ఎరిక్ జన్మించారు. 1993లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్‌ మార్లా మ్యాపుల్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. 1999లో ఈమెతో కూడా విడిపోయి 2005లో మెలానియా ట్రంప్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు.

ఇవానా మంచి వ్యాపారవేత్త..ఆమె అందంతో పాటు చక్కటి వ్యాపార మెళకువలు తెలిసిన అద్భుతమైన మహిళగా ఇవానాకు మంచి పేరుంది. అని..వ్యాపారంలో చక్కగారాణించారని..

Ivana Trump: Ex-Husband Donald 'Was Careless' with COVID-19 | PEOPLE.com

తన పిల్లలకు స్నేహితులుగా ఉంచి మంచి సలహాలు బుతుండేవారని ఇబ్బందులు వస్తే..ఎప్పుడు మానసిక స్థైర్యాన్ని విడిచిపెట్టవద్దని చెబుతుండేవారని ఇవానా తోబుట్టువులు తెలిపారు.

గతంలో భారత్ ను సందర్శించిన ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య కుమార్తె. తల్లి మరణం సందర్భంగా ఇవాంకా ట్రంప్ తన తల్లితో నవ్వుతూ మరియు నవ్వుతూ ఉన్న చిన్ననాటి ఫోటోలను పోస్ట్ చేసింది. ఆమె “తెలివైన, మనోహరమైన, ఉద్వేగభరితమైన..బ్యాడ్ ఫన్నీ” అంటూ అభివర్ణించింది.

 

Related posts