ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్యాక్షన్ లీడర్ అని, డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ మంగళవారం జంతర్‌మంతర్ దగ్గర ఎంపీ మాగంటి బాబు నిరాహారదీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు టీడీపీ ఎంపీలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని మార్చడం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి చేతకాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాహుల్‌ను ప్రధాని చేయాలన్న చంద్రబాబు కోరిక నెరవేరదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారన్న ఆశతో రాహుల్ వెంట చంద్రబాబు పడుతున్నారన్నారు. కక్ష సాధించడం కోసమే కేంద్రం రైల్వేజోన్ ఇవ్వడంలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఉన్నంత వరకు ప్రజలకు సంక్షేమం అందుతుందని అన్నారు. ఎన్నికలకు ముందే రైతులకు చెక్కులు ఇస్తామని జేసీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు: జగ్గారెడ్డి