telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీ ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ముఖ్యాంశాలు!

Minister Yanamala comments Ys Jagan
2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను ఏపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపట్టారు. రూ.2,26,177.53 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించారు. ఈ సారి బడ్జెట్‌లో ఆరు కొత్త పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతూ నిధులను మంజూరు చేసింది. 
రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటించింది.ఈసందర్భంగా  యనమల మాట్లాడుతు వరుసగా మూడోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం రావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. హుతుబద్ధత లేకుండా జరిగిన విభజన కారణాంగా నష్టపోయామని అన్నారు. ఈజ్‌ఆఫ్ డూయింగ్‌లో అగ్రగామిగా ఉన్నామని మంత్రి యనమల పేర్కొన్నారు.  
ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు:  
* మొత్తం బడ్జెట్ అంచనా రూ. 2,26,177.53 కోట్లు.
* రెవెన్యూ వ్యయం రూ. 1,80,369.33 కోట్లు.
* రెవెన్యూ మిగులు రూ. 2,099.47 కోట్లు.
* ఆర్థిక లోటు రూ. 32,390.68 కోట్లు.
* వ్యవసాయ రంగానికి రూ. 12,732.97 కోట్లు
* పశుసంవర్థక, మత్స్య శాఖలకు రూ. 2030.87 కోట్లు.
* బీసీ సంక్షేమానికి రూ. 8,242.64 కోట్లు
* పర్యావరణం, అటవీ శాఖలకురూ. 491.93 కోట్లు.
* ఉన్నత విద్యకు రూ. 3,171.63 కోట్లు.
* ప్రాథమిక విద్యకు రూ. 22,783.37 కోట్లు.
* పౌర సరఫరాల శాఖకు రూ. 3,763.42 కోట్లు.
* వైద్య శాఖకు రూ. 10,032.15 కోట్లు.
* హోమ్ శాఖకు రూ. 6,397.94 కోట్లు.
* గృహ నిర్మాణ శాఖకు రూ. 4,079.10 కోట్లు.
* నీటి పారుదల శాఖకు రూ. 16,852.27 కోట్లు.
* పరిశ్రమల శాఖకు రూ. 4,114.92 కోట్లు.
* ఐటీ శాఖకు రూ. 1,006.81 కోట్లు.
* కార్మిక, ఉపాధి శాఖలకు రూ. 1,225.75 కోట్లు.
* న్యాయ శాఖకు రూ. 918.81 కోట్లు.
* పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 7,979.34 కోట్లు.
* మైనారిటీల సంక్షేమానికి రూ. 1,308.73 కోట్లు.
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ. 35,182.61 కోట్లు.
* రెవెన్యూ శాఖకు రూ. 5,546.94 కోట్లు.
* స్కిల్ డెవలప్ మెంట్ కు రూ. 458.66 కోట్లు.
* సాంఘిక సంక్షేమానికి రూ. 6,861.60 కోట్లు.
* రోడ్లు, భవనాల శాఖకు రూ. 5,382.83 కోట్లు.
* స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 3,408.66 కోట్లు.
* క్రీడలు, యువజన శాఖకు రూ. 1,982.74 కోట్లు.
* ఎస్సీ సబ్ ప్లాన్ కు రూ. 14,363.34 కోట్లు.
* బీసీ సబ్ ప్లాన్ కు రూ. 5,385.31 కోట్లు.
* ‘అన్నదాతా సుఖీభవ’ కార్యక్రమానికి రూ. 5 వేల కోట్లు.
* ఇళ్ల స్థలాల సేకరణ నిమిత్తం రూ. 500 కోట్లు.
* చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాల నిమిత్తం రూ. 400 కోట్లు.
* డ్రైవర్ల సాధికారత కోసం రూ. 150 కోట్లు.
* క్షత్రియుల సంక్షేమానికి రూ. 50 కోట్లు.
* ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 1000 కోట్లు.
* వ్యవసాయ ఆధునికీకరణకు రూ. 300.17 కోట్లు.
* విత్తనాభివృద్ధి నిమిత్తం రూ. 200 కోట్లు.
* ఉద్యానవన శాఖకు రూ. 124 కోట్లు.
* చంద్రన్న బీమాకు రూ. 354.02 కోట్లు.
* అన్న క్యాంటీన్ల కోసం రూ. 300 కోట్లు.
* చంద్రన్న పెళ్లి కానుక నిమిత్తం రూ. 428.47 కోట్లు.
* ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ కోసం రూ. 100 కోట్లు.
* ఇమామ్, మౌజన్ లకు రూ. 100 కోట్లు.
* బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ. 100 కోట్లు.
* వైశ్య కార్పొరేషన్ కు రూ. 50 కోట్లు.
* వృద్ధులు, వితంతువుల పెన్షన్ల నిమిత్తం రూ. 10,401.05 కోట్లు.
* వికలాంగుల పెన్షన్లకు రూ. 2,133.62 కోట్లు.
* డప్పు కళాకారుల పెన్షన్లకు రూ. 108 కోట్లు.
* ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్లకు రూ. 100 కోట్లు.
* రాజధాని ల్యాండ్ పూలింగ్ కు రూ. 226 కోట్లు.
* ఎన్ఆర్ఈజీఎస్ పథకానికి రూ. 1000 కోట్లు.
* రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లకు రాష్ట్ర వాటాగా రూ. 180 కోట్లు.
* చేనేత రంగానికి రూ. 225 కోట్లు.
వీటితో పాటు నిరుద్యోగ భృతిని రూ.2వేలకు  ప్రభుత్వం పెంచింది.  

Related posts