telugu navyamedia
రాజకీయ

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ రైడ్..

లిక్కర్ స్కాంలో దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై చోట్ల సీీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసం లో సీబీఐ సోదాలు నిర్వహించింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(లిక్కర్‌ స్కామ్‌) కేసులో జరిగిన అవకతవకలపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను మనీష్ సిసోడియా ట్వీట్ ర్ వేదిక‌గా ఖండించారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన ట్వీట్ చేశారు. మేము చాలా నిజాయితీగా ఉన్నాం. లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామ‌ని అన్నారు

ఇప్పటివరకు తనపై ఎన్ని కేసులు పెట్టిన ఒక్కటి కూడా రుజువు కాలేదని, ఇది అలాంటిదేనన్నారు. దేశంలో మంచి పనులు చేసే వారిని వేధించడం దురదృష్టకరమని.. అందుకే ఈదేశం ఇంకా నెంబర్ 1 కాలేదంటూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వపై పరోక్షంగా విమర్శలు చేశారు.

మ‌రోవైపు  ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం హయాంలో పాఠశాలల సమగ్ర మార్పుపై ది న్యూయార్క్ టైమ్స్ తన అంతర్జాతీయ ఎడిషన్ లో కథనాన్ని ప్రచురించింది. ఈకథనం వచ్చిన రోజునే సీబీఐ సోదాలు చేయడం రాజకీయ కుట్రలో భాగమని ఆమ్ ఆద్మీ నాయకులు ఆరోపిస్తున్నారు.

సీబీఐ సోదాలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. సీబీఐ విచారణను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో న్యూయార్క్ టైమ్స్ వార్త పత్రిక మొదటి పేజీలో మనిష్ సిసోడియా ఫోటోను ముద్రించిన ఢిల్లీ విద్యా నమూనాను ప్రశంసించిన రోజునే కేంద్రప్రభుత్వం అతడి ఇంటికి సీబీఐని పంపుతుందని ఆరోపించారు.

Related posts