telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

18 మంది యూ కె రిటర్న్స్…146 మందికి కరోనా !

బ్రిటన్ నుంచి బెంగళూరు వచ్చిన మరో వ్యక్తి కోవిడ్ బారినపడ్డారు. బ్రిటన్ నుంచి బెంగళూరు వచ్చిన వారిలో 18 మందికి కరోనా స్ట్రెయిన్ కొత్తరకం లక్షణాలు ఉన్నాయని ఇప్పటికే అధికారులు గుర్తించారు. బ్రిటన్ నుంచి బెంగళూరు వచ్చిన వారిలో 18 మంది కరోనా స్ట్రెయిన్ కొత్తరకం వ్యాధిబారినపడ్డారని అధికారులు గుర్తించారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 54 మంది నేరుగా, 92 మంది ద్వితీయ సంపర్కంతో వారితో కలిశారని గుర్తించిన బీబీఎంపీ అధికారులు వారి ఇళ్లకు పోస్టర్లు, వారు నివాసం ఉంటున్న వీదుల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోకి కొత్త వ్యక్తులు, ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు బయటకు రాకుండా బీబీపీఎం ఆరోగ్య శాఖ అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నవంబర్ 22వ తేదీ నుంచి బ్రిటన్ నుంచి బెంగళూరుకు 1, 433 మంది వచ్చారు. బ్రిటన్ నుంచి బెంగళూరుకు వచ్చిన వారిలో 1, 382 మందిని అధికారులు గుర్తించారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 1, 293 మంది ఇప్పటికే కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అందులో 1, 090 మంది పరిక్షా ఫలితాలు వచ్చాయి. ఇంకా 108 మంది పరీక్షల ఫలితాలు రావల్సి ఉందని బీబీఎంపీ అధికారులు తెలిపారు. బ్రిటన్ నుంచి బెంగళూరు వచ్చిన వారిలో 18 మందికి కొత్త రకం కోవిడ్ స్ట్రెయిన్ లక్షణాలు ఉన్నాయని వెలుగు చూసింది. ఈ 18 మందికి బెంగళూరులోని నిమ్హాన్స్ లో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకా 185 మంది పరీక్షల ఫలితాలు రావలసి ఉందని, బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో మరికొంత మందికి వైద్యపరీక్షలు నిర్వహించాల్సి ఉందని వైద్య శాఖ అధికారులు అంటున్నారు. బెంగళూరు నగరంలో ఇంతకు ముందు కోవిడ్-19 బారిన పడిన వ్యక్తులు నివాసం ఉంటున్న ఇళ్లకు, వారు నివాసం ఉంటున్న ప్రాంతంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. తరువాత కోవిడ్ సోకిన వ్యక్తుల నివాసం ఉంటున్న వారి ఇళ్లకు మాత్రమే పోస్టర్లు అతికించే వారు. తరువాత ఆ పద్దతిని బీబీఎంపీ అధికారులు విరమించుకున్నారు. ఇప్పుడు కొత్త రకం స్ట్రెయిన్ కోవిడ్ దెబ్బకు మళ్లీ బీబీఎంపీ అధికారులు పోస్టర్లు, బ్యారికేడ్ల సాంప్రధాయాన్ని తెరమీదకు తీసుకు వచ్చారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారితో సంబంధాలు పెట్టుకున్న కొంత మందికి వైద్యపరీక్షలు చేసి వారివారి ఇళ్లలో ఉండాలని అధికారులు సూచించారు. అయితే బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో టచ్ లో ఉన్న కొంత మంది వారి ప్రాంతాల్లో గిర్రున బొంగరాల్లాగా తిరుగుతున్నారని, వారికి ఎంత చెప్పినా ఏ మాత్రం పట్టిచుకోకుండా నిర్లక్షం చేస్తూ ఇతరుకు వ్యాధి అంటించడానికి ప్రయత్నిస్తున్నారని బీబీఎంపీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఎంత చెప్పినా వారు మాట వినకుండా తిరుగుతున్నారని, అందుకే వారు నివాసం ఉంటున్న ఇళ్లకు పోస్టర్లు అతికించి వారు నివాసం ఉంటున్న వీదుల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని బీబీఎంపీ ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారి రాజేంద్ర చోళన్ మీడియాకు చెప్పారు. బెంగళూరులోని జేపీనగర్, కుమారస్వామి లేఔట్, విఠల్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే బ్యారికేడ్లు, కొన్ని అపార్ట్ మెంట్ లకు పోస్టర్లు అతికించారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారితో బెంగళూరులో కొత్తరకం స్ట్రెయిన్ కరోనా వ్యాధి వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని బీబీఎంపీ కమీషనర్ గౌరవ్ గుప్తా ప్రజలకు మనవి చేస్తున్నారు. మొత్తం మీద బెంగళూరులో మళ్లీ కోవిడ్ పోస్టర్లు, బ్యారికేడ్లు దర్శనం ఇవ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related posts