telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

బ్రేన్ ఫీడ్ 7వ జాతీయ విద్యా సదస్సులో … ప్రముఖుల స్ఫూర్తిదాయక సందేశాలు..

brainfeed 3 days 7th national conf.

‘బ్రేన్ ఫీడ్’ 7వ జాతీయ విద్యా సదస్సు హైదరాబాద్ హైటెక్స్ లో అట్టహాసంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాలలో అనేకమంది ప్రముఖులు, విద్యావేత్తలు, పలు విద్యాసంస్థల అధినేతలు పాల్గొని వారి విలువైన సందేశాలు ఇచ్చారు. తొలి రోజు జరిగిన కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ చుక్క రామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండవ రోజు కూడా అనేకమంది ప్రముఖులు పాల్గొని తమ సందేశాలను వినిపించారు. మూడవరోజు మాజీ జెడి లక్ష్మీనారాయణ, జనార్ధనరెడ్డి, రాజశేఖరరెడ్డి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో ప్రముఖులు ఇచ్చిన సందేశాలను పలు పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చాయి.

ప్రారంభం రోజున అబ్ క్లాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కె పాండే, సీ-ఫోర్ చీఫ్ ఎగ్జిక్యూటీ ప్రేమ్ చంద్, చిన్మయ యువ కేంద్ర మాజీ డైరెక్టర్ స్వామి చిద్రుపానంద, హెడ్ ప్రిన్సిపాల్ హిర్సికంపుస్ ఫిన్ ల్యాండ్, నికోలుమి, పోదార్ ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్ మెన్ రాఘవ్ పోదార్, కథలయ ట్రస్ట్ చైర్ మెన్ గీతా రామానుజన్, 2018 ఫెమినా మిస్ ఇండియా శ్రేయా రావు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు సప్నా సుకుల్, లీనా ఆశర్, స్కంద్ బలి, శిరీశ్, ఆండ్రీన వసీ, అరుణబ్ సింగ్, సీతా మూర్తి, రిక్రిత్, మాధవి చంద్ర, డాక్టర్ రవి సుర పాల్గొన్నారు. రెండవ రోజున ప్రముఖ వక్తలు సీ.ఈ.ఓ మేరేడియన్ స్కూల్స్ హైదారాబాద్ డాక్టర్ ఉషా డీ రెడ్డి, ఐ బి డెవలప్ మేనేజర్ ఆఫ్ ఇండియా మహేశ్ బాలకృష్ణన్, ఫౌండర్ ఆఫ్ స్టోరీ ఆర్ట్స్ ఫౌండేషన్ దీపా కిరణ్, ఫౌండర్ ఆఫ్ గ్రీన్ స్కూల్ మూవ్మెంట్ వీరేంద్ర రావత్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ హాండ్ రైటింగ్ అకాడమీ వై. మల్లికార్జున్ రావులు పాల్గొని తమతమ సందేశాలను వినిపించారు.

Related posts