telugu navyamedia
సినిమా వార్తలు

“బ్రహ్మాస్త్ర” తెలుగు లోగో

BRamhastra

ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జొహార్ నిర్మాణంలో భారీ బడ్జెట్ చిత్రంగా “బ్రహ్మాస్త్ర” రూపొందుతోంది. అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణబీర్ కపూర్, నాగార్జున, అలియా భట్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. భారత దేశంలో మొట్టమొదటి మైథలాజికల్ త్రయాలజీ డ్రామాగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా హిందీ టైటిల్ లోగోను ఇటీవల “ప్రయాగ”లో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు టైటిల్ లోగోను రాజమౌళి తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. “బ్రహ్మాస్త్ర” టైటిల్ లోగో చాలా బాగుందని, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు.

కింగ్ నాగార్జున దాదాపు పదిహేనేళ్ల తర్వాత 2019 మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ “బ్రహ్మాస్త్ర” చిత్రంతో బాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు. బ్రహ్మాస్త్ర ఫ్రాంచైజీలో మూడు భాగాలుంటాయి. అందులో మొదటి భాగాన్ని క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 25 డిసెంబర్ 2019న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇతర భాగాల్ని తదుపరి తెరకెక్కించేందుకు సన్నాహాలు సాగుతూనే ఉన్నాయి.

Related posts