telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఐటీగ్రిడ్స్‌ కేసులో అశోక్‌కు చుక్కెదురు

TS High Court Gives Shock to Ashok

డాటా చోరీ వ్యవహారంలో ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కుమార్ పిటీషన్‌పై హైదరాబాద్‌ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై, కంపెనీపై కేసు పెట్టారని, ఆ కేసులను తొలగించాలని హైకోర్టులో అశోక్ కుమార్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన హైకోర్టు.. పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

ఇక అశోక్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లోత్ర వాదనలు వినిపించారు. కేసు తెలంగాణ పరిధిలోకి రాదని, ఏపీకి బదిలీ చేయాలని కోరారు. అయితే సిద్దార్థ్‌ వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీ భవించలేదు. మరోవైపు అశోక్‌కు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం ఆ నోటీసులకు సమాధానం ఇవ్వలేమని అశోక్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో వెంటనే అశోక్‌ను పోలీసుల నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Related posts