telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

నల్లధనం

employee offering money to his lead
దానికి బాగా పొగరెక్కువ
లెక్కచెయ్యనితనంలోంచి వూడిపడిందిగా
ఏ నైవేద్యానికీ పనికిరాని పూజాద్రవ్యాన్నని ఎరగని వెర్రి సన్నాసి…
దొంగవేషాలెయ్యటం వెన్నతో పెట్టిన విద్య దానికి
తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆరును నూరు చేయగల దిట్ట 
రంగుమారిన తక్షణం శూన్యమవుతానని తెలవని అజ్ఞాని….
ఒళ్లంతా అహంభావపు కళ్లే
ప్రపంచాన్ని కొనగలననే ధీమానేదానిది
అనురాగాన్ని వెలకట్టలేని తూకపురాయి చందమని ఎరగనివెర్రిమొఖమే ….
తన వక్రాలే సొగసైన ఆభరణాలని భ్రమసే కాకి బంగారమది.నల్లధనమది.
                        సోంపాక సీత.
                         భద్రాచలం

Related posts