telugu navyamedia
సామాజిక

హైద‌రాబాద్ మెట్రోలో ఓ అమ్మ‌కు అవ‌మానం..

మానుసుల్లో మాన‌వ‌త్వం రోజు రోజుకు త‌గ్గిపోతోంది. అక్క‌డ ఉన్న వాళ్ళంతా చుదువుకున్న వాళ్ళే.. ప‌సిపాప త‌ల్లిపై సానుభూతి చూపించే మ‌న‌సు లేదు..

ఓ మహిళ నెలల వయసున్న శిశువుతో మెట్రో రైల్లో ప్రయాణిస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ దృశ్యం చూస్తే ఎలాంటి వాళ్లు అయినా అయ్యో పాపం అన‌క త‌ప్ప‌దు. ఇంత‌కి ఆ సంఘ‌ట‌న ఏంటి? ఎక్క‌డ జ‌రిగింది? అనుకుంటున్నారా?..మ‌న భాగ్య‌న‌గ‌ర్‌లో జ‌రిగింది.

హైదరాబాద్ మెట్రోలో నెల‌ల ప‌సిపాప‌ను ప‌ట్టుకుని ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలు ప్ర‌యాణిస్తుంది. మెట్రోలో ఎక్క‌డ చూసిన‌ ఖాళీ లేదు అంతా పుల్ అయ్యింది. ఆమె ఒక్క‌రే అయితే ప‌ర‌వాలేదు… ఆమె చేతిలో ప‌సికందు కూడా ఉంది..ఆ మహిళకు కూర్చోడానికి సీటు దొరక్కపోవడంతో..ఎత్తుకుని నిలబడలేక చంటి బిడ్డను తీసుకుని కిందనే కూర్చుంది. ఏడుస్తున్న బిడ్డను ఒడిలో కూర్చొబెట్టుకుని లాలిస్తుంది.

అయితే సీట్‌లో కూర్చున్న కొంత‌మంది టీనేజ్ మ‌హిళ‌లు అమ్మ‌త‌నం మ‌రిచిపోయి జాలీ కూడా చూపించ‌కుండా అలానే కూర్చున్నారు. మాకేందుకు అనే ధోరణిలో చెవిలో హెడ్‌ఫోన్స్‌ తగిలించుకుని.. మొబైల్‌ ఫోన్స్‌లో బిజీగా గడిపేసి, సొల్లు క‌బుర్లు చెప్పుకుంటున్నారు. ఏ ఒక్కరు కూడా ఆమెకు సీటు ఇవ్వడానికి ముందుకు రాలేదు.

అయితే ..అదే మెట్రో ప్ర‌యాణిస్తున్న‌ మరికొందరు తమ ఫోన్‌తో వీడియో తీశారు. ఇదీ మన సంస్కారం అంటూ క్యాప్షన్ పెట్టి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. దీంతో ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజ‌న్లు ఆ ప్రయాణికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Related posts