telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

నల్లధనం

huge money caught by police in ap

అవినీతి ధనం పాము పడగనీడ వంటిది
ఎంతకాలమని పడగ నీడన తలదాచుకుంటారు
ధన దాహం ,అధికార దాహం
మనిషి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం
అవినీతి ధనం ఎంత సంపాదిస్తే అంత ఆనందం
ఆ అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి అధికారం కావాలి
తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకొని
వెనకేసుకున్నా
పోయాక వేసేది ఆరడుగుల గోతిలోనే
తినడానికి తిండిలేక
ఉండడానికి నిలువ నీడ లేక
ఎందరో అభాగ్యులు
ఇంకెందరో ఆనాధలు
బ్రతుకుతున్న ఈ దేశంలో
అవినీతి సొమ్ముతో
భవంతుల పై భవంతులు నిర్మించుకొని
ప్రజల డబ్బును దోచుకుంటూ
దానిని విదేశాలలో దాచుకొంటూ
ఆ నల్ల ధనాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారే మనుషులు
మనిషికి బ్రతకడానికి డబ్బు కావాలి
ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించాలి
అవినీతి సొమ్ముతో అంతస్తులు కట్టి నిద్రలేక గడిపేవాడు ఒకడైతే
చెట్టుక్రింద సుఖంగా నిద్రించేవాడు మరియొకడు
ఇద్దరిదీ ఆఖరున ఒకటే మజిలీ
********
పత్తిపాటి రూపలత
తిరుపతి

Related posts