telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయిన కేసీఆర్ మాట‌ల‌కు ప్ర‌జ‌లు న‌వ్వుతున్నారు…

తెలంగాణను సీఎం కేసీఆర్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. చౌటుప్పల్ మండలం కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి కేసీఆర్‌పై విమర్శలు చేశారు. పీడిత ప్రజానీకం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టిస్తానని చెప్పి సీఎం కేసీఆర్‌ మర్చిపోయారని అన్నారు. హైద‌రాబాద్ లోని ట్యాంక్ బండ్ పై చాక‌లి ఐల‌మ్మ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించాలని ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్ చేశారు.

Image

దేశ రాజ‌కీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తాన‌ని అంటున్నార‌ని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. రాష్ట్రంలోనే ఏమీ చేయ‌లేని వ్య‌క్తి, దేశంలో ఏం చేస్తార‌ని ప్ర‌శ్నించారు.

ప్రజల విశ్వాసం కోల్పోయిన కెసిఆర్ దేశాన్ని పాలిస్త అనే మాటలను బఫూన్ మాటలుగా అనుకుంటున్నారన్నారని తీవ్ర కామెంట్ చేశారు రాజేందర్‌.

తెలంగాణ ధ‌నిక రాష్ట్రంగా ఉండేద‌ని, కానీ దానిని అప్పుల కుప్ప‌గా మార్చేశార‌ని రాజేంద‌ర్ తీవ్రంగా ఆరోపించారు. తెలంగాణ‌ను అవినీతికి అడ్ర‌స్ గా మార్చార‌ని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ చతికిలపడిపోతుందని విమర్శించారు ఈటల. కెసిఆర్ నియంతృత్వం, దోపిడీ అరికట్టలేకపోయారని చెప్పారు. బీజేపీకి మాత్రమే ఆసత్తా ఉందని బీజేపీలో చేరారనీ… ధర్మానికి కట్టుబడి రాజీనామా చేసి ప్రజల ముందుకు ముందుకొచ్చారని తెలిపారు.

కెసిఆర్‌ను ఓడించడానికి అనేకమంది ప్రజాప్రతినిధులు, నాయకులు బీజేపీలో చేరుతున్నారన్నారన్నారు ఈటల. టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్‌లో చేసినట్టే మునుగోడులో కూడా చేస్తుందని ఆరోపించారు. మద్యం పంచి, డబ్బులు ఇచ్చి మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

Related posts