telugu navyamedia
తెలంగాణ వార్తలు

దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ..

కేంద్రంలో బీజేపీ అమలు చేసిన అన్ని చట్టాలకు, పథకాలకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ అంటూ డ్రామా చేస్తోందని మాజీఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు

కేసీఆర్ చుట్టూ చేరిన భజన మండలి చేస్తున్న భజన చూస్తుంటే అక్బర్ బీర్బల్ కథ గుర్తుకు వస్తోందని పొన్నం సెటైర్లు వేశారు.

దేశంలో  బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అని పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీభవన్‌లో శనివారం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఒక్కసారి మీ పాలన వెనక్కి తిరిగి చూసుకోండ‌ని అని అన్నారు.

ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతు రుణమాఫీ, యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ.. ఏమైందని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాత కేసీఆర్.. దేశ రాజకీయాల గురించి మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామ‌ని, ఇప్పుడు ఒక్కటి అమలు కావడం లేద‌ని అన్నారు.

రేషన్ షాపుల వద్ద, మరుగు దొడ్ల వద్ద మా ఫోటోలు లేవంటే మా ఫోటోలు లేవని కొత్త బిచ్చగాళ్లుగా టీఆర్ ఎస్‌, బిజెపి నేతలు కొట్లాడుకుంటున్నార‌ని ఎద్దేవ చేశారు.

కేసీఆర్ తెలంగాణను అప్పులమయం , అవినీతి మయం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు చేసే ముందు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు.. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో మా సీటు కాదు ..మునుగోడు మా సీటు.. మేము దక్కించుకుంటాం ..నేను కూడా ప్రచారానికి వెళ్తా అంటూ వెల్ల‌డించారు.

Related posts