telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేసీఆర్ మరో కొత్త పార్టీ – “భార‌త రాష్ట్ర స‌మితి“

దేశానికి గర్వకారణంగా నిలిచే కొత్త అజెండా, సిద్ధాంతాలు హైదరాబాద్‌ వేదికగా వస్తే అది రాష్ట్రానికే గర్వకారణమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయని కేసీఆర్‌ వెల్లడించారు.

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఉత్సుక‌త చూపుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఆ పార్టీకి పేరు కూడా ప్ర‌క‌టించారు. “భార‌త రాష్ట్ర స‌మితి“ బీఆర్ ఎస్ పేరును ఆయన తాజాగా ప్లీన‌రీలో ప్ర‌క‌టించారు. దీనిని బ‌ట్టి కేసీఆర్ త్వ‌ర‌లోనే జాతీయ రాజ‌కీయాల్లో ఈ పార్టీ పేరుతోనే ప్ర‌చారం చేయ‌నున్నార‌నే ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఇక‌, ఆయ‌న మాట్లాడుతూ.. భారత దేశాన్ని ప్రగతి పంథాలో నడిపించడానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదని.. ప్రజలను అభ్యుదయ మార్గంలో పయనించేలా చేసే కొత్త సిద్ధాంతాలు, ప్రత్యామ్నాయ రాజకీయ అజెండాలు అని అన్నారు.

Related posts