ఏపీ సీఎం జగన్ నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం వరకు హైదరాబాద్ కు చేరుకొనున్నారు. అనంతరం ప్రగతి భవన్ లో కేసీఆర్, జగన్ ల మధ్య పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. విభజన చట్టంలో నెలకొన్న సమస్యల పై చర్చించే అవకాశముంది.
అదేవిధంగా జల వనరుల సద్వినియోగం, ఏపీకి రావాల్సిన పెండింగ్ విద్యుత్ బకాయిలు, 9, 10వ షెడ్యూల్ లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అనంతరం పలు అంశాల పై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ఇరు రాష్ట్రాలకు చెందిన ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.
గత సందాయాలను పాటించలేదు: అచ్చెన్నాయుడు