ఇప్పటి వరకు ఈవీఎం ల తేడా పనితనం ఏపీలోనే కనిపించింది, తాజాగా, తెలంగాణలో కూడా వెలుగు లోకి వచ్చింది. అక్కడ జరుగుతున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలోని పబ్లిక్ స్కూల్ లో ఓటేసి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను నిలబడిన భువనగిరి పరిధిలోని 10 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు.
ఈ పోలింగ్ బూత్ లలో ఎవరికి ఓటు వేసినా, వీవీ ప్యాట్ మెషీన్లలో కారు గుర్తు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ఆయా ప్రాంతాల నుంచి తనకు ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటికే ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకు వెళ్లానని అన్నారు. ఈ ప్రాంతాల్లో వెంటనే పోలింగ్ ను ఆపేసి, రీపోలింగ్ జరపాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నాయకులు అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
వాళ్లు కూడా మనుషులే… బ్లడీ స్టుపిడ్ పోలీస్