telugu navyamedia
రాజకీయ

ఇద్దరు చంద్రులు ఫ్రంట్ల కోసం విశ్వ ప్రయత్నాలు: బీజేపీ చీఫ్ లక్ష్మణ్

ఇద్దరు చంద్రులు ఫ్రంట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని  తెలంగాణ బీజేపీ చీఫ్ కె.లక్ష్మణ్ అన్నారు. వారి ఇద్దరి ఇద్దరి ప్రయత్నాలు విఫలం కావడం తథ్యమన్నారు. జాతీయస్థాయిలో మహాకూటమి, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం జరుగుతున్న రాజకీయ పరిణామాల పై ఆయన స్పందించారు. హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఫ్రంట్లు టెంట్ల వల్ల ప్రయోజనం లేదన్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. ఇదంతా కుటుంబపార్టీలన్ని కలిసి తమ ఉనికి చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రమేనన్నారు.  
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణప్రజలు సైతం మోదీకే పట్టం కట్టాలని ఆసక్తి చూపుతున్నారని జోస్యం చెప్పారు. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ సాధించబోయేది ఏదీ లేదని స్పష్టం చేశారు. కూటములు, ఫ్రంట్లు ప్రధాని అభ్యర్థి ఎవరనేది తేల్చుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచినా ఇప్పటివరకూ ప్రభుత్వ ఏర్పాటు పూర్తికాలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేసే పరిస్థితి లేదని చెప్పారు.

Related posts