వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. 150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృత్రిమ కొరతను సృష్టించారని విమర్శించారు. లక్షల మంది భవన కార్మికులకు రూ. 150 కూలీ కూడా దొరకని పరిస్థితిని తీసుకొచ్చారని అన్నారు.
ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని తాను ఇంతవరకు చూడలేదని ఆయన ట్వీట్ చేశారు. వైసీపీ భవనాలకు పార్టీ రంగులు వేసుకోవాడానికి తప్ప, రాష్ట్రాన్ని పాలించడానికి వైసీపీ పనికిరాదని విమర్శించారు. దీంతోపాటు, వివిధ కట్టడాలపై వైసీపీ రంగులు వేసిన ఫోటోలను షేర్ చేశారు. వీటిలో గ్రామ సచివాలయం, చేతి పంపు, శ్మశానం, ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి.


ఎఐసీసీ పెద్దల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు: డీకే అరుణ