telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బీజేపీ పార్టీ ఉప అధ్యక్షులుగా .. ఉమా భారతి

umabarati as bjp wise president

కేంద్ర మంత్రి ఉమా భారతిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇటీవల ఆమె రాబోయే ఎన్నికలలో పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేయడంతో, ఆమెకు ఈ పదవి కట్టబెట్టినట్టు తెలుస్తుంది. ఆమెను పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్టు పార్టీ అధికార ప్రకటన కూడా చేసింది. లోక్‌ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనంటూ ఆమె ప్రకటించిన రోజుల వ్యవధిలో ఈ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

యూపీలోని ఝాన్సీ లోక్‌ సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న ఉమా భారతి, మే తరువాత ఏడాదిన్నరపాటు తీర్థయాత్రలకు వెళ్లనున్నానని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వయసు రీత్యా తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించడం లేదని, తన స్థానంలో యువతకు ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. దీనితో ఆమె సేవలు పార్టీకి కావాలంటూ, కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న ఉమాకు బీజేపీ, ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.

Related posts