telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చట్టాల సవరణపై కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం సరికాదు: డీకే అరుణ

DK Aruna comments on congress

చట్టాల్లో మార్పు కోసం సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని బీజేపీ నేత డీకే అరుణహితవుపలికారు. నల్గొండలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓటమి భయంతోనే కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ఫలితాలు రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో అవినీతికి పాల్పడేది రెవెన్యూ అధికారులా ? టీఆర్ఎస్ నాయకులా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనేనన్నారు. కాంగ్రెస్‌పై జనంలో నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. . దేశ ప్రజలంతా మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుంకుటున్నారని అభిప్రాయపడ్డారు.

Related posts