telugu navyamedia
సినిమా వార్తలు

‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ మొద‌లైంది..

అతి పెద్ద తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌ శనివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది.

అతి పెద్ద తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకుంది మొదటి సీజన్ నుంచి చివరిగా వచ్చిన సీజన్ 5 వరకు మంచి టీఆర్పీ తో దూసుకుపోయింది .

ఇక‌పై ఈ గేమ్ షో నాన్ స్టాప్ గా 17 మంది కంటెస్టెంట్లు, 84 రోజుల నాన్‌స్టాప్  వినోదం ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ వేదికగా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేసింది. 

గ్రాండీయర్‌గా ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్‌ నాగార్జున. స్టాప్‌.. దిస్‌ ఈస్‌ బిగ్‌బాస్‌ నాన్‌ స్టాఫ్‌ అంటూ స్మాల్‌ స్క్రీన్‌పైకి వచ్చేశాడు.

ఎప్పుడు కావాలంటే అప్పుడు బిగ్‌బాస్‌ని చూసేయొచ్చు అని నాగార్జున చెప్పారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి.. ఇల్లు మొత్తాన్ని చూపించారు. కిచెన్, వాష్ రూమ్, డైనింగ్ ఏరియా, బెడ్ రూమ్, హాల్, కన్ఫెషన్ రూమ్ ఇలా ఇంట్లో అన్ని రూమ్స్ ని చూపించారు.

ఓటీటీ సదుపాయం ఉన్నవారు ఇకపై రోజూ 24×7 హౌస్‌లో ఏం జరుగుతుందో చూడవచ్చు.

Related posts