telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ రెండవ పెళ్ళి

Samrat

ఈ సంవత్సరం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుంటే… మరోవైపు టాలీవుడ్ లో వరుసగా పెళ్ళి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే రానా, నిఖిల్, కాజల్ తదితరులు తమ సోల్ మేట్స్ తో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇక మెగా డాటర్ నిహారిక మెడలో త్వరలోనే మూడుముళ్లు పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్‌బాస్ సీజన్ 2 ఫేమ్ సామ్రాట్ రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరి శిల్పారెడ్డి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. కాకినాడకు చెందిన శ్రీ లిఖిత అనే యువతిని సామ్రాట్ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సామ్రాట్ ఫ్రెండ్స్ అయిన బిగ్‌బాస్-2 కంటెస్టెంట్స్.. త‌నీష్‌, దీప్తి సున‌య‌న కూడా ఈ వివాహ వేడుకలో సంద‌డి చేశారు. గతంలో హర్షిత అనే యువతిని సామ్రాట్ పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లకే వారి మధ్య కలహాలు మొదలు కావడంతో విడాకులు తీసుకున్నారు.

Related posts