నందమూరి నటసింహం బాలకృష్ణ ఎట్టకేలకు తన తదుపరి చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. అయన ఇటీవల ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ను బ్యాంకాక్ లో చిత్రీకరించనున్నారు. ఆగస్టు 7నుండి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రంలో బాలయ్య కు జోడిగా సోనాల్ చౌహన్ , వేదిక నటించనున్నారు. సీనియర్ నటి భూమిక చావ్లా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని సమాచారం.
రూలర్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భూమిక కనిపించనుందట. ఆమె పాత్రా సినిమా కు కీలకం కానుంది. సి కళ్యాణ్ నిర్మించనున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి విడుదలకానుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. ఇక కె ఎస్ రవి కుమార్ , బాలకృష్ణ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ‘జై సింహ’ పర్వాలేదనిపించింది. ఇక రూలర్ తరువాత బాలయ్య , డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయిన పూరి ప్రస్తుతం బాలయ్య కోసం కథను సిద్ధం చేసే పనిలో వున్నాడట. ఒకవేళ బాలకృష్ణ , పూరి తో సినిమా చేయడానికి మొగ్గు చూపితే బోయపాటి శ్రీను కు మరి కొంత కాలం వెయిటింగ్ తప్పదు.