telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీకారం : ఆకట్టుకుంటున్న ఫోక్ మెలోడీ “భలేగుంది బాల” సాంగ్

Sreekaram

యంగ్ హీరో శర్వానంద్ రైతుపాత్రలో ‘శ్రీకారం’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నాడు. శర్వా సరసన ప్రియాంకా అరుల్‌ మోహన్ హీరోయిన్ గా‌ నటిస్తోంది. అయితే ఇటీవలే చిత్ర యూనిట్ ఒక కీలక షెడ్యూల్ కు తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ‘భలేగుంది బాల’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ ఫోక్ మెలోడీ సాంగ్ శ్రోతలను బాగా ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ లిరికల్ వీడియోను వీక్షించండి.

Related posts