ఇటీవల బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇళ్లపై ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్(tax) ఎగ్గొట్టాడని ఐటీ అధికారులు వెల్లడించారు కూడా. దాదాపు మూడురోజుల పాటు ఆయన ఇంట్లో సోదాలు చేపట్టిన ఐటీ విభాగం.. తర్వాత ప్రకటన విడుదల చేసింది. అయితే ఇపుడు సోనూసూద్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
తన కార్యాలయాలపై జరిగిన ఆదాయపపన్ను దాడుల గురించి నటుడు సోనూసూద్ ట్విట్టర్ వేదికగా పరోక్షంగా స్పందించారు. చరిత్రను చెప్పుకోవాల్సిన అవసరం లేదని.. కాలమే చెబుతుందని ట్విట్టర్లో రాసుకొచ్చారు. తాను దేశప్రజలకు సేవచేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నానని తెలిపారు. నా ఫౌండేషన్లో ప్రతి రూపాయి.. పేదల కోసం ఖర్చు పెడతాను.. ప్రజల ప్రాణాలను రక్షించటం కోసం..కొంత మంది అతిథులు రావటం వల్ల నాలుగు రోజులుగా మీకు సేవ చేయలేకపోయానని అన్నారు. మళ్లీ మీకు సేవ చేసేందుకు వచ్చాను.. నా ప్రస్థానం కొనసాగుతుంది”..
కరోనా సమయంలో వందలాది మందికి సాయం సోనూసూద్ అందించారు. ఈ సేవాగుణం కారణంగా దేశవ్యాప్తంగా ఆయనకు లక్షలాది మంది అభిమానులు అయిపోయారు. పెద్దపెద్ద సెలెబ్రెటీలు సైతం ఆయనను ప్రశంసించారు. ఇంత ఫాలోయింగ్ ఉన్న నటుడిపై ఆరోపణలు రావడం సర్వత్రా చర్చనీయాశం అయింది.
వారి కోడలు కావడం గర్వంగా ఉంది : ఉపాసన