తాజాగా వెలువడిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో మమత బెనర్జీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఈరోజు బెంగాల్ సీఎంగా మమత బెనర్జీ ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటలకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు కఠినం చేశారు. ప్రజలు మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. మాస్క్ ధరించకుంటే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం మంది మాత్రమే హాజరుకావాలని పేర్కొన్నారు. మాల్స్, సినిమా హాల్స్, జిమ్స్, బ్యూటీ పార్లర్లు మూసి ఉంటాయని అన్నారు. రాజకీయ, సామాజిక సమావేశాలపై మమతా సర్కార్ నిషేధం విధించింది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మమతా పేర్కొన్నారు. అయితే చూడాలి మరి ఈ నిర్ణయాలు అక్కడ ఎంత ఫలిస్తాయి అనేది.
previous post
next post